RR vs KKR: బోణి కొట్టి కోల్‌కతా..ఖాతా తెరవని రాజస్థాన్ 8 d ago

రాజస్థాన్ రాయల్స్‌తో (RR) జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటి మ్యాచ్ పరాజయంతో ఇరు జట్లు గౌహతి వేదికగా తలపడగా రాజస్థాన్‌పై డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా పై చేయి సాధించింది. దీంతో కేకేఆర్ బోణి కొట్టగా.. ఆర్ఆర్‌కు వరుస ఓటుములు తప్పలేదు.క్వింటన్ డికాక్ సూపర్ ఇన్నింగ్స్‌తో 17.3 ఓవర్లకే 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్‌ను ముగించాడు. స్లో పిచ్ లో కూడా దూకుడుగా ఆడి కేకేఆర్ పాయింట్ల ఖాతాను తెరిపించాడు.
తొలుత టాస్ తెలిచి బౌలింగ్ ఎంచుకున్న KKR జట్టు.. అద్భుత బౌలింగ్ ప్రదర్శనను కనపరిచింది. కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలవడంతో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. జట్టు పరుగులు పెంచే క్రమంలో సంజూ శాంసన్ (13) తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. అయితే యశస్వి జైశ్వాల్ (29).. కెప్టెన్ రియాన్ పరాగ్ (25) అందించిన శుభారంభాన్ని మిగిలిన ఆటగాళ్లు కొనసాగించలేక పోయారు. RR బ్యాటర్లను కోలుకోనివ్వకుండా KKR స్పిన్నర్లులు అడ్డుకట్ట వేశారు.
సునీల్ నరైన్ ప్లేసులో జట్టులోకి వచ్చిన మొయిన్ అలీ (4 ఓవర్లలో 23 పరుగులు, 2 వికెట్లు) అద్భుత బౌలింగ్ ప్రదర్శన కనపరిచాడు. దీంతో KKR టాప్ బౌలర్ వరుణ్ చక్రవర్తి (4 ఓవర్లలో 17 పరుగులు, 2 వికెట్లు) విరుచుకుపడ్డాడు. స్పిన్నర్ల ధాటికి ఒక్కసారిగా RR టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయింది.. చివరిలో ధ్రువ్ జురెల్ (33) నిలపడిన జట్టుకు భారీ స్కోర్లు అందించలేకపోయారు. దీంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్‌ల నష్టానికి 151 రన్స్ చేసింది.
లక్ష్య సాధన కోసం బరిలోకి దిగిన KKR ఓపెనర్లు మొదట్లో అంతగా రాణించలేకపోయారు. మొయిన్ అలీ బౌలింగ్ బాగా వేసిన.. బాటింగ్ లో (12 బంతుల్లో 5 రన్స్) ఆకట్టుకోలేకపోయాడు. కెప్టెన్ రహానే (18) కూడా తక్కువ పరుగులకే వెనుతిరిగాడు. అయితే డికాక్ మొదట్లో కాస్త నిదానంగా ఆడిన..చివరిలో మెరుపులు పుట్టించాడు. స్లో పిచ్ మీద కూడా తన బాటింగ్ నైపుణ్యాన్ని కనపరిచాడు. అసలు RR బౌలర్లకు ఏమాత్రం అవకాశం కూడా ఇవ్వలేదు. ఒంటి చేతితో KKR కూడా విజయం అందించాడు. 61 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సులతో 97* పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు.
17.3 ఓవర్లకే 153 పరుగులతో కోల్‌కతా నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై విజయం సాధించింది. ఆఖరి ఓవర్‌లో ఆర్చర్ రెండు వైడ్లు వేసి డికాక్ సెంచరీని మిస్ చేసాడని అభిమానులు సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. IPL 2025లో తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్.. ఆర్సీబీ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో గెలిచి.. తొలి విజయాన్ని నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో ఖాతాను తెరిచి.. ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు.. అట్టడుగున నిలిచింది.
టోర్నీలో భాగంగా ఈరోజు మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల మధ్య అద్భుతమైన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 PM ISTకు ప్రారంభంకానుంది.